23, ఏప్రిల్ 2011, శనివారం

ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ ఉత్తర్వులు

ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ ఉత్తర్వులు విడుదలైనవి. దీని ప్రకారం
  1. పాఠశాలలు తెరుచునాటికల్ల ఈ ప్రక్రియ పూర్తవ్వాలి.
  2. పాఠశాలలోని 01-12-2010 నాటి రోల్ ఆధారంగ ఈ ప్రక్రియ సాగుతుంది.
  3. రేషనలైజేషన్ మండల పరిషత్,ప్రభుత్వ,జిల్లా పరిషత్,మున్సిపల్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలలకు వర్తిస్తుంది.(మున్సిపల్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ వారికి మరిన్ని మార్గదర్శకములు రావలసియున్నది.)
  4. 5వ తరగతి వరకు
Enrolment range
(Ito V Classes) HeadMaster No. of SGTs
Upto 19 1
20 – 60 2
61 – 90 3
91 – 120 4
121 – 150 5
151 – 200 1 5
201 – 240 1 6
241 – 280 1 7
281 – 320 1 8
321 – 360 1 9
361 - 400 1 10

18, ఏప్రిల్ 2011, సోమవారం

మునిసిపల్ ఉపాధ్యాయులకు ప్రీ ఆడిట్ కొనసాగింపు

పురపాలక సంఘ ఉపాధ్యాయుల వేతనముల చెల్లింపుకు ప్రతి నెల ప్రీ ఆడిట్ అవసరంలేదని శ్రీముఖం జారి చేసిన విషయం తెలిసినదే. కాని ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా నేరుగా ఖజానా శాఖనుండి చెల్లింపు కుదరదని ఆ శాఖ తేల్చిచెప్పినందున పురపాలక ఉద్యోగ మరియు ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో నుంచుకుని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చునంతవరకు ప్రీ ఆడిట్ కొనసాగించవలసినదిగా శ్రీముఖం జారి చేయడమైనది.
అప్రజాస్వామిక పోకడలతో ఉద్యోగుల గొంతునోక్కే నొ వర్క్ నొ పే జిఓ 177 నిలుపుదల చేస్తూ దిగువ జి.ఓను ప్రభుత్వం విడుదల చేసింది.
అయితే మనం గుర్తుంచుకోవలసిన అంశం మనము ప్రజలలో ఒక్కరం. మన సమస్యలను ప్రజలకు వివరించగలగాలి, వారి మద్దత్తుతో మనం ఎన్నో సాధించగలుగుతాం.వారిని ఇబ్బంది పెడితే వారితో పాటు మనం ఇబ్బందులపాలౌతాం. ఈ విషయం లో జపాన్ ని ఆదర్శంగా తీసుకోవాలి.

11, ఏప్రిల్ 2011, సోమవారం

ఇంటి అద్దె అలవెన్సు పెంపుదల ఉత్త్తర్వులు

ప్రస్తుతమున్న10 మరియు 12.5 శాతం HRA లను12% మరియు 14.5% గా పెంచుతూ ఉత్తరువులు విడుదల కాబడినవి.

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

ట్రైబల్ వెల్ ఫేర్ ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలు

సుదీర్ఘ పోరాటాల అనంతరం ట్రైబల్ వెల్ ఫేర్ ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ ఉత్తర్వుల ప్రకారం SA cadre ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తారు.దిగువ cadre ఉపాధ్యయుల సర్వీసు నిబంధనలను APPSC పరిశీలనకు పంపారు.త్వరలో అవి కూడా విడుదల కావచ్చును.
పదవీవిరమణ ఉద్యోగుల గ్రాట్యుటి రూ. 7,00,000 నుండి రూ 8,00,000 పెంచడమైనది.
హిస్టరాక్టమీ ఆపరేషన్ చేసుకున్న మహిళా ఉద్యోగినులకు 45రోజుల ప్రత్యక సెలవు మంజూరు చేయుచు ఉత్తర్వులు విడుదలైనవి.