24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

పురపాలక సంఘ డి.య.సి ఉపాధ్యాయులపై ప్రభుత్వం సీతకన్ను

ప్రభుత్వం తన పాలనలో నున్న స్థానిక స్వపరిపాలనలోనున్న లక్షలాది ఉపాధ్యాయులకు నిరంకుశంగా చేయించుకున్న వెట్టిచాకిరి(అప్రంటీస్)కి పరిహారంగ నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి తప్పును కొంత సరిదిద్దుకుంది.కాని ఇదే విధంగా డి.య.సి.ద్వార రాష్ట్రవ్యాప్తంగ నియమించబడిన కేవలం 2500 లోపు ఉన్న పురపాలక సంఘ డి.య.సి ఉపాధ్యాయులపై ప్రభుత్వం సీతకన్ను వేసింది.నోషనల్ ఇంక్రిమెంట్ల దస్త్రము ఇప్పటికే ముమ్మార్లు గౌ||ముఖ్యమంత్రిగారి కార్యాలయం->ఆర్థికశాఖావారి కార్యాలయం-> డైరక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిష్ట్రేషన్ వారి కార్యాలయముల చుట్టు ప్రదక్షిణ చేసినా తృప్తి పడకపోవడం వలన మరోమారు ప్రదక్షిణకు సిద్దమవుతుంది.ఇందుమూలంగ నగర,పట్టణ జీవనగమనంలో పెరిగిన ధరవరలను అందుకోలేక నూతన వేతనములు మానని పండై అందక ఊరిస్తుంటే సదరు వేతనజీవి అయిన పురపాలక ఉపాధ్యాయుడు సతమతమైపోతున్నాడు. ప్రభుత్వం ఇకనైన ఏ మాత్రము తనకు భారము కాని నోషనల్ ఇంక్రిమెంట్లపై క్లియరెన్సు ఇచ్చి ఉపాధ్యాయుల ఆందో ళను నివారిస్తే బాగుంటుంది.

Estimation New DA for A.P Employes

కేంద్రప్రభుత్వం తన ఉధ్యోగులకు నూతనంగ కరువు భత్యం 35 % నుండి 45% కు అనగా 10 % పెంచింది.ఈ పెంపుదల 01-07-2010 నుండి అమలులోనికి వస్తుంది.దీని ప్రకారం రాష్త్రప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నాటికి రాష్ట్రప్రభుత్వం తమ ఉద్యోగులకు పి.ఆర్.సి 2005 వేతన స్కేళ్ళ ప్రకారం వేతనం పొందుతున్న ఉద్యొగులకు కరువుభత్యం 88.548 % (73.476+15.072) గాను,పి.ఆర్.సి 2010 వేతన స్కేళ్ళప్రకారం వేతనం పొందుతున్న ఉద్యోగులకు 24.824 % (16.264+8.56) గానిర్ణయించబడుతుంది.