16, నవంబర్ 2011, బుధవారం

30, అక్టోబర్ 2011, ఆదివారం

Mpl.Teachers Notional Increments

ఎట్టకేలకు పురపాలక సంఘ DSC  ఉపాధ్యాయులకు Notional Increments ప్రకటిస్తూ ఉత్తర్వులు జి.ఓ 488 జారి చేసింది .కానీ అందరిలాగా DSC  2000 ద్వారా ఎంపికై మునిసిపలిటీలో నియమకవదమేనా ఈ ఉపాద్యాయులు చేసిన పాపం. తనతోపాటు చేరిన ఉపాధ్యాయులు ఇప్పటికే notional  increments  తీసుకుని ఉంటె మునిసిపల్ ఉపాద్యాయులు మాత్రం సుమారు రూ.21 ,౦౦౦/-నష్టబోతున్నారు దీనిని UTF  తీవ్రంగా ఖండిస్తోంది.ఈ నష్టనివారణకు PDF  MLC  ల సహాయంతో తన ప్రయత్నాలను ముమ్మరంగా  చేస్తుంది.త్వరలోనే ఆశావహ ఫలితాలు రావచ్చునని  ఆశిద్దాం.

24, అక్టోబర్ 2011, సోమవారం

18, జులై 2011, సోమవారం

15, జులై 2011, శుక్రవారం

Spl.DSC for TW

Director of Mpl.Admistration ప్రభుత్వం వారికి పురపాలక ఉపాధ్యాయ,ఉద్యోగులకు ప్రి ఆడిట్ ఎత్తివేయమని సిఫారసు చేస్తూ జాబు వ్రాసింది. దీనిని ప్రభుత్వం అనుమతిస్తే పురపాలక ఉద్యోగులకు చాల సమయం మరియు ధనం ఆదా చేసినట్లవుతుంది.
గిరిజన పాఠశాలలకు ప్రతేక DSC నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.వివరాలు జి.ఓ దిగువన గలవు

Sl.No.

Category of Post

Total No. of posts Sanctioned

Posts to be filled up by Direct Recruitment

1

Panel Grade Head Master

190

---

2

School Assistant (Maths)

213

64

3

School Assistant (English)

330

99

4

School Assistant

(Phy. Science)

330

99

5

School Assistant

(Biological Science)

8

2

6

School Assistant

(Social Studies)

179

54

7

School Assistant (Telugu)

162

49

8

School Assistant (Hindi)

178

53

9

School Assistant

(Phy. Education)/ PD-Gr-II

330

99

10

Telugu Pandit Gr-II

231

231

Total

2151

750

29, జూన్ 2011, బుధవారం

Guntur Promotion Lists

ప్రతి నెల ప్రమోషన్లు ఇచ్చేక్రమంలో గుంటూరు డి.ఇ.ఒ గారు HM Posts(15+2Govt),LFLHM(10),SA(BS)-2,SA(SS)-11,SA(hindi)-2,SA(Telugu)-5,SA(Eng)-4 ఖాళీలకు సీనియారిటి లిస్టులు ప్రకటించారు.

28, జూన్ 2011, మంగళవారం

దశాబ్దాల పోరాటల ఫలితంగ గిరిజన సంక్షేమశాఖ కు సబార్డినేట్ సబార్డినేట్ రూల్స్ ప్రభుత్వం విడుదల చేసింది.

కుటుంబ పెన్షర్లు మరణాంతర death relief 5000 నుండి 10000 లకు ప్రభుత్వం పెంచింది.
యూ.టి.యఫ్ నిరసన దీక్షల కరపత్రం

29, మే 2011, ఆదివారం

23, మే 2011, సోమవారం

20, మే 2011, శుక్రవారం

New Automatic Advancement Scheme

గతంలో జెఏసితో కుదిరిన ఒప్పందం మేరకు ప్రస్తుతం అమలులోనున్న ఆటోమాటిక్ అడ్వాన్సుమెంటు స్కీము (8/16/24 years) స్థానంలో (6/12/18/24 years) గా మారుస్తూ ప్రభుత్వం జి.ఓ49 ను ది: 20-5-11న విడుదలచేయడమైనది.
జి.ఓ నందలి సారాంశం :-

Special Grade (6 సం||) :- ఉద్యోగి ఆరు సంవత్సరముల సర్వీసు పూరైన తదుపది స్పెషల్ గ్రేడు పోస్టు అవుతుంది. ఒక ఇంక్రిమెంటుతో ప్రస్తుత స్కేలు తరువాతి స్కేలు నందు స్థిరీకరించబడుతుంది.

SPP I-A (12 సం||) :- ప్రమోషన్ పోస్టుకు అర్హత కలిగి ఉండి ప్రమోషన్ పొందని 12 సం|| సర్వీసు నిండిన ఉద్యోగులు అర్హులు.ఒక ఇంక్రిమెంటుతో ప్రస్తుత స్కేలు తరువాతి స్కేలు నందు స్థిరీకరించబడుతుంది.

SAPP I-A(12 సం||) :-ప్రమోషన్ పోస్టుకు అర్హత లేని, 12 సం|| సర్వీసు నిండిన ఉద్యోగులు అర్హులు.ఒక ఇంక్రిమెంటుతో ప్రస్తుత స్కేలు తరువాతి స్కేలు నందు స్థిరీకరించబడుతుంది.

SPP I-B (18 సం||) :-ప్రమోషన్ పోస్టుకు అర్హత కలిగి ఉండి ప్రమోషన్ పొందని 16 సం|| సర్వీసు నిండిన ఉద్యోగులు అర్హులు.ఒక ఇంక్రిమెంటుతో ప్రస్తుత స్కేలు తరువాతి స్కేలు నందు స్థిరీకరించబడుతుంది.

SAPP I-B(18 సం||) :-ప్రమోషన్ పోస్టుకు అర్హత లేని, 18 సం|| సర్వీసు నిండిన ఉద్యోగులు అర్హులు.ఒక ఇంక్రిమెంటుతో ప్రస్తుత స్కేలు తరువాతి స్కేలు నందు స్థిరీకరించబడుతుంది.

SPP II(24సం||) :- రెండవ ప్రమోషన్ కు కావలసిన అన్ని అర్హతలు కలిగి స్ట్రీము లైనులో ఆ పోస్టు కలిగినవారికి ఒక ఇంక్రిమెంటుతో ప్రస్తుత స్కేలు తరువాతి స్కేలు నందు స్థిరీకరించబడుతుంది.

SAPP II(24సం||) :- రెండవ ప్రమోషన్ కు కావలసిన అర్హతలు లేని/ అర్హతలు కలిగి స్ట్రీము లైనులో ఆ పోస్టులేని వారికి ఒక ఇంక్రిమెంటు మాత్రం ఇవ్వబడుతుంది

  • ఈ ఉత్తర్వులు 1-2-2010 నుండి అమలులో వస్తాయి. 1-2-10 నుండి 31-5-11 వరకు పి.యఫ్ ఖాతానందు బకాయిలు జమచేయబడతాయి.

19, మే 2011, గురువారం

17, మే 2011, మంగళవారం

Rationalization Gos

Go.55

MDM cost raising Go Released

మధ్యాహ్న భోజన పథకం లో కుకింగ్ కాష్ట్ పెంచుతూ ఉత్తర్వులు G.o 420 విడుదల అయినది.
పదవతరగతి గ్రేడింగ్ విధానం మార్గదర్శకత్వం చేస్తూ ఉత్తర్వులు Go.419 విడుదల అయినది

23, ఏప్రిల్ 2011, శనివారం

ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ ఉత్తర్వులు

ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ ఉత్తర్వులు విడుదలైనవి. దీని ప్రకారం
  1. పాఠశాలలు తెరుచునాటికల్ల ఈ ప్రక్రియ పూర్తవ్వాలి.
  2. పాఠశాలలోని 01-12-2010 నాటి రోల్ ఆధారంగ ఈ ప్రక్రియ సాగుతుంది.
  3. రేషనలైజేషన్ మండల పరిషత్,ప్రభుత్వ,జిల్లా పరిషత్,మున్సిపల్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలలకు వర్తిస్తుంది.(మున్సిపల్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ వారికి మరిన్ని మార్గదర్శకములు రావలసియున్నది.)
  4. 5వ తరగతి వరకు
Enrolment range
(Ito V Classes) HeadMaster No. of SGTs
Upto 19 1
20 – 60 2
61 – 90 3
91 – 120 4
121 – 150 5
151 – 200 1 5
201 – 240 1 6
241 – 280 1 7
281 – 320 1 8
321 – 360 1 9
361 - 400 1 10

18, ఏప్రిల్ 2011, సోమవారం

మునిసిపల్ ఉపాధ్యాయులకు ప్రీ ఆడిట్ కొనసాగింపు

పురపాలక సంఘ ఉపాధ్యాయుల వేతనముల చెల్లింపుకు ప్రతి నెల ప్రీ ఆడిట్ అవసరంలేదని శ్రీముఖం జారి చేసిన విషయం తెలిసినదే. కాని ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా నేరుగా ఖజానా శాఖనుండి చెల్లింపు కుదరదని ఆ శాఖ తేల్చిచెప్పినందున పురపాలక ఉద్యోగ మరియు ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో నుంచుకుని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చునంతవరకు ప్రీ ఆడిట్ కొనసాగించవలసినదిగా శ్రీముఖం జారి చేయడమైనది.
అప్రజాస్వామిక పోకడలతో ఉద్యోగుల గొంతునోక్కే నొ వర్క్ నొ పే జిఓ 177 నిలుపుదల చేస్తూ దిగువ జి.ఓను ప్రభుత్వం విడుదల చేసింది.
అయితే మనం గుర్తుంచుకోవలసిన అంశం మనము ప్రజలలో ఒక్కరం. మన సమస్యలను ప్రజలకు వివరించగలగాలి, వారి మద్దత్తుతో మనం ఎన్నో సాధించగలుగుతాం.వారిని ఇబ్బంది పెడితే వారితో పాటు మనం ఇబ్బందులపాలౌతాం. ఈ విషయం లో జపాన్ ని ఆదర్శంగా తీసుకోవాలి.

11, ఏప్రిల్ 2011, సోమవారం

ఇంటి అద్దె అలవెన్సు పెంపుదల ఉత్త్తర్వులు

ప్రస్తుతమున్న10 మరియు 12.5 శాతం HRA లను12% మరియు 14.5% గా పెంచుతూ ఉత్తరువులు విడుదల కాబడినవి.

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

ట్రైబల్ వెల్ ఫేర్ ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలు

సుదీర్ఘ పోరాటాల అనంతరం ట్రైబల్ వెల్ ఫేర్ ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ ఉత్తర్వుల ప్రకారం SA cadre ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తారు.దిగువ cadre ఉపాధ్యయుల సర్వీసు నిబంధనలను APPSC పరిశీలనకు పంపారు.త్వరలో అవి కూడా విడుదల కావచ్చును.
పదవీవిరమణ ఉద్యోగుల గ్రాట్యుటి రూ. 7,00,000 నుండి రూ 8,00,000 పెంచడమైనది.
హిస్టరాక్టమీ ఆపరేషన్ చేసుకున్న మహిళా ఉద్యోగినులకు 45రోజుల ప్రత్యక సెలవు మంజూరు చేయుచు ఉత్తర్వులు విడుదలైనవి.

28, మార్చి 2011, సోమవారం

మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రీ ఆడిట్ ను ఉపసంహరణ

పురపాలక సంఘంలో పనిచేయుచున్న ఉపాధ్యాయులకు ప్రీ ఆడిట్ ను ఉపసంహరణ సూచిస్తూ రాష్ట్ర ఆడిట్ వారు నేడు శ్రీముఖం సంఖ్య 2822 ను విడుదల చేసినది. దీనిని ఖజాన శాఖ మరియు పురపాలక సంఘ శాఖ ఆమోదించితే పురపాలక ఉపాధ్యాయు తమ జీతాలు అందుకునుటలో జాప్యం పూర్తిగా తొలగుతుంది.
పదవతరగతి పరీక్షాకేంద్రములుగా పనిచేయుచున్న పాఠశాలలకు మధ్యాహ్నం పాఠశాలకు ఏప్రిల్ 1,5,6,7,8,9 తేదిలలో సెలవు ప్రకటించింది.ఈ ఆరు రోజులకు కాంపన్సేషన్ గా తరువాతి దినములలో పాఠశాల నిర్వహించవలసి ఉంటుంది.

8, మార్చి 2011, మంగళవారం

Spl.CLs(5) for DSC'08 Memo

3, మార్చి 2011, గురువారం

APGLI DEDUCTION GO

ప్రభుత్వం వారు పురపాలక సంఘంలో పని చేయుచున్న ఉద్యోగ,ఉపాధ్యాయుల వేతనముల నుండి తప్పనిసరిగా Mar 2011 payble Aprl 2011 బిల్లులనుండి APGLI SLABS ప్రకారం గాని OR మూలవేతనంలో 20% చప్పున ఉద్యోగి ఆప్షన్ ప్రకారం ప్రిమియం చెల్లించు విధముగా ఉత్తర్వులు జారీ చేసింది.(ఈ ఉత్తర్వులు విజయవాడ,విశాఖపట్నం,హైదరాబాదు ఉద్యోగులకు వర్తించవు కేవలం 010 పద్దు పై వేతనములు తీసుకునువారికి మాత్రమే)

19, ఫిబ్రవరి 2011, శనివారం

TET guide lines

TET guide lines

1, ఫిబ్రవరి 2011, మంగళవారం

25, జనవరి 2011, మంగళవారం

జనగణన సమయంలో ఉద్యోగ విధులపై మార్గదర్శకములు

జన గణన చేయుచున్న గణకులు,పర్యవేక్షకులకు తమ విధులకు హాజరు విషయమై జి.ఓ54 ది:25-01-11 ప్రభుత్వం విడుదల చేసింది.ఈ ఉత్తర్వుల ప్రకారం ది: 09-02-11 నుండి 28-02-11 విధులకు ఒకపూట తప్పనిసరిగా హాజరు అవ్వాలి. ది: 01-03-.11 నుండి 05-03-11 వరకు 5రోజులు పూర్తిగ జనగణన కార్యక్రమమునకు అంకితమవ్వాలి.

23, జనవరి 2011, ఆదివారం

JAC AGREEMENTS

జె.ఎ.సి కి ప్రభుత్వాని మధ్య జరిగిన చర్చలు సఫలం అయినాయి.ఒప్పందం పత్రంలోని కొన్ని అంశాలు
  1. ప్రస్తుతమున్న10% & 12.5% హెచ్.ఆర్.ఎ రేట్ల కు 2% పెంపుదలను 1-04-2011 నుండి అమలు
  2. ప్రస్తుతమున్న ఆటోమాటిక్ అడ్వాన్సుమెంటు స్కీము 8/16/24 స్థానములో 6/12/18/24 స్కీమును 01-02-2010 నుండి అమలు (బహుస ప్రకటించిన తేది తరువాత అర్హత కలిగినవారికి అమలు చేయవచ్చు)
  3. ఉద్యోగులందరికి ఆరోగ్య కార్డులు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలొ ఏర్పాటు చేయడం.
  4. స్పెషల్ విధ్యా వాలంటీర్లకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం.
  5. ఉపాధ్యాయులకు అప్రెంటీసు విధానం రద్దు.
  6. 9వ వేతన సవరణ సంఘ సిఫారసులన్నింటిని అమలు
  7. హిస్టిరెక్టమి ఆపరేషన్ చేయించు కున్న మహిళా ఉద్యోగినులకు 45 రోజుల ప్రత్యేక సెలవు.
  8. పంచాయితి రాజ్ సెక్రేటరీలను కోర్టు ఉత్తర్వులననుసరించి నెలలోగ రెగ్యులరైజ్ చెయడం.
<------------ o0o ----------->

10, జనవరి 2011, సోమవారం

సెప్టంబర్ 7 నాడు దేశవ్యాప్త సమ్మెకు ప్రత్యేక సెలవు మంజూరు జి.ఓ

వెతలకు వెరిసేది పోరాటమేకాదు,కుంటి సాకులతో నాయకత్వాన్ని ఎదిరించి ఫలితమప్పుడు అనుభవించడానికి ముందుండేవాడు కార్యకర్తాకాదు. నేటి మన తరం గుర్తుంచుకోవలసిన శ్రీశ్రీ గారి వాక్యం"పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్ళు తప్ప..",ఉద్యోగ,ఉపాధ్యాయులను అధికారగణమునకు బానిసలుగ వారి స్వార్థప్రయోజనాల కోసం మారుస్తున్న సంఘాల పట్ల,నాయకుల పట్ల జాగురకతతొ మెలగవలసిన అవసరం వివేకంగల ప్రతి ఒక్కరికి ఉంది.
ప్రభుత్వం సెప్టంబర్ 7 నాడు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నవారికి మరియు జె.ఏ.సి పిలుపుమేరకు సాముహిక సెలవు పెట్టిన వారికి ప్రత్యేక సెలవులను మంజూరు చేస్తు ఉత్తర్వులను విడుదల చేసింది.