25, జనవరి 2011, మంగళవారం

జనగణన సమయంలో ఉద్యోగ విధులపై మార్గదర్శకములు

జన గణన చేయుచున్న గణకులు,పర్యవేక్షకులకు తమ విధులకు హాజరు విషయమై జి.ఓ54 ది:25-01-11 ప్రభుత్వం విడుదల చేసింది.ఈ ఉత్తర్వుల ప్రకారం ది: 09-02-11 నుండి 28-02-11 విధులకు ఒకపూట తప్పనిసరిగా హాజరు అవ్వాలి. ది: 01-03-.11 నుండి 05-03-11 వరకు 5రోజులు పూర్తిగ జనగణన కార్యక్రమమునకు అంకితమవ్వాలి.

23, జనవరి 2011, ఆదివారం

JAC AGREEMENTS

జె.ఎ.సి కి ప్రభుత్వాని మధ్య జరిగిన చర్చలు సఫలం అయినాయి.ఒప్పందం పత్రంలోని కొన్ని అంశాలు
  1. ప్రస్తుతమున్న10% & 12.5% హెచ్.ఆర్.ఎ రేట్ల కు 2% పెంపుదలను 1-04-2011 నుండి అమలు
  2. ప్రస్తుతమున్న ఆటోమాటిక్ అడ్వాన్సుమెంటు స్కీము 8/16/24 స్థానములో 6/12/18/24 స్కీమును 01-02-2010 నుండి అమలు (బహుస ప్రకటించిన తేది తరువాత అర్హత కలిగినవారికి అమలు చేయవచ్చు)
  3. ఉద్యోగులందరికి ఆరోగ్య కార్డులు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలొ ఏర్పాటు చేయడం.
  4. స్పెషల్ విధ్యా వాలంటీర్లకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం.
  5. ఉపాధ్యాయులకు అప్రెంటీసు విధానం రద్దు.
  6. 9వ వేతన సవరణ సంఘ సిఫారసులన్నింటిని అమలు
  7. హిస్టిరెక్టమి ఆపరేషన్ చేయించు కున్న మహిళా ఉద్యోగినులకు 45 రోజుల ప్రత్యేక సెలవు.
  8. పంచాయితి రాజ్ సెక్రేటరీలను కోర్టు ఉత్తర్వులననుసరించి నెలలోగ రెగ్యులరైజ్ చెయడం.
<------------ o0o ----------->

10, జనవరి 2011, సోమవారం

సెప్టంబర్ 7 నాడు దేశవ్యాప్త సమ్మెకు ప్రత్యేక సెలవు మంజూరు జి.ఓ

వెతలకు వెరిసేది పోరాటమేకాదు,కుంటి సాకులతో నాయకత్వాన్ని ఎదిరించి ఫలితమప్పుడు అనుభవించడానికి ముందుండేవాడు కార్యకర్తాకాదు. నేటి మన తరం గుర్తుంచుకోవలసిన శ్రీశ్రీ గారి వాక్యం"పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్ళు తప్ప..",ఉద్యోగ,ఉపాధ్యాయులను అధికారగణమునకు బానిసలుగ వారి స్వార్థప్రయోజనాల కోసం మారుస్తున్న సంఘాల పట్ల,నాయకుల పట్ల జాగురకతతొ మెలగవలసిన అవసరం వివేకంగల ప్రతి ఒక్కరికి ఉంది.
ప్రభుత్వం సెప్టంబర్ 7 నాడు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నవారికి మరియు జె.ఏ.సి పిలుపుమేరకు సాముహిక సెలవు పెట్టిన వారికి ప్రత్యేక సెలవులను మంజూరు చేస్తు ఉత్తర్వులను విడుదల చేసింది.