13, డిసెంబర్ 2010, సోమవారం

ఉపాధ్యాయుల ప్రవర్తనానియమావళి ప్రతిపాదనలు

ఉపాధ్యాయులకు కచ్చితమైన ప్రవర్తనానియమావళి ఉండాలని విద్యాహక్కు చట్టం2009 నిబందనలను అనుసరించి నియమావళిని NCTE ప్రతిపాదించినది వాని పూర్తివివరములను దిగువలింకునందుచుతున్నాము.

Mpl S.A Posts Lists released

ప్రభుత్వం వారు రాష్ట్రంలోనును పురపాలక సక్సస్ పాఠశాలలకు 829 స్కూలు అసిస్టెంటు పోష్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను ,జాబితాను విడుదల చేసింది.ఈ జాబిత పాఠశాల చదువుతున్న విద్యార్థుల పనిచెయుచున్న ఉపాధ్యాయుల నిష్ఫత్తి ఆధారంగ (30 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని చప్పున) తయారుచేయుట జరిగింది. కొన్నిచోట్ల జరిగిన అసమంజస విషయములను యూ.టి.యఫ్ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి సరిచేయుటకు కృషి చెయుచున్నది.

6, డిసెంబర్ 2010, సోమవారం

పెరిగిన కరువు భత్యం

ఉద్యోగ,పెన్షనర్లకు ప్రభుత్వం వారు కరువు భత్యం 16.244% నుండి 24.824% అనగా 8.56% వెత్యాసముతొ ఉత్తర్వులు 356 మరియు 353 ది:6-12-10నాడు వెలువడినవి.ఈ ఉత్తర్వుల ప్రకారం జులై 2010 నుండి నవంబరు 2010వరకు అనగా ఐదు నెలల వ్యత్యాసమును భవిష్యనిధి నందు జమ చేస్తారు.డిసెంబరు నుండి నగదు రూపంలొచెల్లిస్తారు.పెన్షనర్లకు జులై నుండి రావలసిన బకాయిలను వారి పెన్షన్ ఖాతాలొ జమచేస్తారు.
మనము ముందు ఊహించినట్లుగానే PRC2005 వారికి డి.ఎ 88.548%(73.476+15.072) చెల్లిస్తారు.

1, నవంబర్ 2010, సోమవారం

DSC2008 Selection List

గుంటూరు జిల్లా డి.యస్.సి 2008 సెలక్షన్ లిష్టు విడుదలచేయడమైనది.
  • రేపు అనగా నవంబరు 2 Certificate verification
  • 3- SGT s counseling జరుగును. నూతన ఉపాధ్యాయులకు యు.టి.యఫ్.హార్ఠిక స్వాగతం పలుకుతుంది.

29, అక్టోబర్ 2010, శుక్రవారం

ప్రభుత్వం వారు డి.య.స్సి 2008 నియామకలకు తెరతీసినది.క్రొత్త ఉపాధ్యాయులకు స్వాగతం పలుకుతూ జి.ఓ కాపి మరియు మెరిట్ లిష్టు లింకులు దిగువున ఇస్తున్నాము.

25, అక్టోబర్ 2010, సోమవారం

విధ్యాశాఖ పురపాలక సంఘ 92 ప్రధానఉపాధ్యాయ(గ్రేడ్-2 ) పోష్టులను మరియు 106 - సహోపాధ్యాయ పోష్టులను స్కూల్ అసిస్టెంటులుగా అప్ గ్రేడ్ చేసి,829-స్కూల్ అసిస్టెంటు పోష్టులను సృస్టిస్తూ ఉత్తర్వులు జారి చేసింది.

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

పురపాలక సంఘ డి.య.సి ఉపాధ్యాయులపై ప్రభుత్వం సీతకన్ను

ప్రభుత్వం తన పాలనలో నున్న స్థానిక స్వపరిపాలనలోనున్న లక్షలాది ఉపాధ్యాయులకు నిరంకుశంగా చేయించుకున్న వెట్టిచాకిరి(అప్రంటీస్)కి పరిహారంగ నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి తప్పును కొంత సరిదిద్దుకుంది.కాని ఇదే విధంగా డి.య.సి.ద్వార రాష్ట్రవ్యాప్తంగ నియమించబడిన కేవలం 2500 లోపు ఉన్న పురపాలక సంఘ డి.య.సి ఉపాధ్యాయులపై ప్రభుత్వం సీతకన్ను వేసింది.నోషనల్ ఇంక్రిమెంట్ల దస్త్రము ఇప్పటికే ముమ్మార్లు గౌ||ముఖ్యమంత్రిగారి కార్యాలయం->ఆర్థికశాఖావారి కార్యాలయం-> డైరక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిష్ట్రేషన్ వారి కార్యాలయముల చుట్టు ప్రదక్షిణ చేసినా తృప్తి పడకపోవడం వలన మరోమారు ప్రదక్షిణకు సిద్దమవుతుంది.ఇందుమూలంగ నగర,పట్టణ జీవనగమనంలో పెరిగిన ధరవరలను అందుకోలేక నూతన వేతనములు మానని పండై అందక ఊరిస్తుంటే సదరు వేతనజీవి అయిన పురపాలక ఉపాధ్యాయుడు సతమతమైపోతున్నాడు. ప్రభుత్వం ఇకనైన ఏ మాత్రము తనకు భారము కాని నోషనల్ ఇంక్రిమెంట్లపై క్లియరెన్సు ఇచ్చి ఉపాధ్యాయుల ఆందో ళను నివారిస్తే బాగుంటుంది.

Estimation New DA for A.P Employes

కేంద్రప్రభుత్వం తన ఉధ్యోగులకు నూతనంగ కరువు భత్యం 35 % నుండి 45% కు అనగా 10 % పెంచింది.ఈ పెంపుదల 01-07-2010 నుండి అమలులోనికి వస్తుంది.దీని ప్రకారం రాష్త్రప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నాటికి రాష్ట్రప్రభుత్వం తమ ఉద్యోగులకు పి.ఆర్.సి 2005 వేతన స్కేళ్ళ ప్రకారం వేతనం పొందుతున్న ఉద్యొగులకు కరువుభత్యం 88.548 % (73.476+15.072) గాను,పి.ఆర్.సి 2010 వేతన స్కేళ్ళప్రకారం వేతనం పొందుతున్న ఉద్యోగులకు 24.824 % (16.264+8.56) గానిర్ణయించబడుతుంది.

16, ఆగస్టు 2010, సోమవారం

Enhanced MDM Rates

ప్రభుత్వం వారు G.O 470 ది 16.08.2010 ప్రకారం ఈ విద్యాసంవత్సరమునకు 9 మరియు 10 వతరగతి విధ్యార్ఠులకు మధ్యాహ్న భోజన పథకమునందు పచన రేట్లు రూ.3.25 నుండి రూ.4.17 నకు ది 01-04-10 నుండి అమలగునట్లు ఉత్తర్వులు జారీ చేసారు.

7, ఆగస్టు 2010, శనివారం

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రధానానికి ధరఖాస్తులకు ఆహ్వానం

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రధానానికి ధరఖాస్తులను దిః 25-08-10 నాటికి జిల్లా కమిటికి అందేలా నిర్ణీత ప్రొఫార్మలో అందజేయాలి.దిగువున ప్రొసీడింగ్స్ ,ప్రొఫార్మ ను దిగుమతి చేసుకోగలరు.

20, జులై 2010, మంగళవారం

Tribal Welfare Teachers నోషనల్ ఇంక్రిమెంట్లు పై వివరణ శ్రీముఖం

Tribal Welfare Teachers నోషనల్ ఇంక్రిమెంట్లు పై వివరణ శ్రీముఖం 8663 ది 1-7-2010.

11, జులై 2010, ఆదివారం

సవరించబడిన నోషనల్ ఇంక్రిమెంటు సాఫ్ట్ వేర్

సవరించబడిన నోషనల్ ఇంక్రిమెంటు సాఫ్ట్ వేర్ ఈ లింకు ద్వార Download చేసుకోగలరు.

1, జులై 2010, గురువారం

Notional Increments

ఎన్నో పోరాటాల ఫలితం మొక్కవోని ఉపాధ్యాయుల దీక్ష,పట్టుదలల వలన నోషనల్ ఇంకిమెంట్ల మెమో 8663 విడుదలయినది.ఈ విజయం మరిన్నిపోరాట విజయాలకు స్ఫూర్తికావాలి. యోధులకు ఉధ్యమాభినందనలు.
*******
ఉపాధ్యాయుల కోసం ready reckoner,Memo,ApGli go Copy లింకులు ఈ దిగువన ఇస్తున్నాము . మీ అభిప్రాయములను పోష్టు చేయగలరు.

28, జూన్ 2010, సోమవారం

గుంటూరు జిల్లా సెకండరి గ్రేడు ఉపాధ్యాయుల ఖాళీలు

గుంటూరు జిల్లా సెకండరి గ్రేడు ఉపాధ్యాయుల ఖాళీల వివరములను జిల్లా కలెక్టరుగారు 28-06-10న విడుదలచేశారు.

26, జూన్ 2010, శనివారం

DSC2008 GUNTUR SELECTED LIST

DSC 2008 ద్వారా ఎంపిక కాబడిన వారి వివరములను DOWNLOAD చేసుకునవచ్చు.

25, జూన్ 2010, శుక్రవారం

Promotion Panel list

Download Guntur Promotion Panel List

21, జూన్ 2010, సోమవారం

డి.యస్.సి 2008 నియామకము మరియు రేషనలయిజేషన్

ఎ ట్టకేలకు ప్రభుత్వం డి.యస్.సి 2008 నియామకములకు తెరతీస్తూ జి.వో 26,GO 27 ఉత్తర్వులను జారీ చేసింది. వీటితొపాటు రేషనలయిజేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు.ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులలోపు 1 ఉపాధ్యాయుడు,21 నుండి 60 మంది విద్యార్థులలోపు ఇరువురు ఉపాధ్యాయులు,61 నుండి90 మంది విద్యార్థులలోపు ముగ్గురు ఉపాధ్యాయులు,91-120 మంది విద్యార్థులలోపు నలుగురు ఉపాధ్యాయులు excess ఉపాధ్యాయులను నిబందనల ప్రకారం అవసరమున్న పాఠశాలలో నియమిస్తారు.దిగువ లింకు ద్వార ఉత్తర్వులు వీక్షించవచ్చు.

31, మే 2010, సోమవారం

PRC PAY FIXATION SOFTWARE

ఈ లింకు నుండి వేతనసవరణ సాఫ్ట్ వేర్ ను దిగుమతి చేసుకోండి CLICK HERE

17, మే 2010, సోమవారం

అప్రంటీస్ కాలాన్ని పెన్షన్

నూతన వేతన సవరణ సంఘ సిఫారసుల మేరకు అప్రంటీస్ కాలాన్ని పెన్షన్ కాలానికి గణించుటకు ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు GO no.178 Dt.17-5-10 ఇవ్వడమయినది.

14, ఏప్రిల్ 2010, బుధవారం

File Download Procedure



మీరు క్లిక్ చేసిన వెంటనే ప్రక్కన సూచించి సైటు లోనికి వస్తారు








సైటు క్రిందకు వస్తే మనకు ఈ విధము గా కనబడుతుంది. డౌన్ లోడ్ నౌ అను దానిని మనము ఎంచుకోవాలి.


ఆ తరువాత మరల మొదటి స్థానమునకు వెళ్ళు తుంది. తరువాత సైటు క్రిందకు వస్తే మనకు ఈ విధము గా కౌంట్ డౌన్ అవు తు కనబడుతుంది.



కౌంట్ డౌన్ పూర్తి అయిన తరువాత ఎర్రని అక్షరములతో ఈ దిగువున చూపిన విధంగా Download with Filefactory basic ఆని కనబడుతుం ది. దానిని క్లిక్ చేయండి.



ఈ విధం గా డౌన్ లోడ్ ప్రారంభమవుతుంది. మిమ్మల్ని Open or Save Option అడుగుతుంది. save ని ఎంచుకోండి. డౌన్ లోడ్ పూర్తయిన తరువత దానిని double click ద్వార unzip చేసి install చేసుకోండి













ఈ సాఫ్టువేర్ ను ఎంచుకున్నందుకు ధన్యవాదములు.

7, ఏప్రిల్ 2010, బుధవారం

విశ్రాంత ఉద్యోగులకు వేతన సవరణ ఉత్తర్వులు విడుదల

దిః 06-04-2010 నాడు ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు వేతన సవరణ ఉత్తర్వులు విడుదల అయినవి.
డెత్ రిలీఫ్ జి.ఒ 102,గ్రాడ్యుటి జి.ఒ 101, మరియు ఉద్యోగులకు ఇతర అలవెన్సులు జి.ఒ సంఖ్య 95, 96, 97, 98, 99 విడుదల అయినవి.దిః 07-04-2010 నాడు డ్యూటి అలవెన్సులు జి.ఒ 264,118,కన్వేయన్సు అలవెన్సులు జి.ఒ108 విడుదల అయినవి.

9, మార్చి 2010, మంగళవారం

నూతన వేతన సవరణ నందు డి.ఎ,హె.చ్.ఆర్.ఎ,సి.సి.ఎ ఉత్తర్వులు విడుదల

దిః 09-03-2010 నాడు నూతన వేతన సవరణకు అనుబంధంగా జి.ఒ 63(D.A),జి.ఒ 64(HRA),జి.ఒ 65 (CCA) దిః03-04-2010నాడు అటొమాటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీం జి.ఒ 93 ఉత్తర్వులు వెలువడినవి.underline ఉన్నచోట వాటిని డౌనులోడు చేసుకొనవచ్చు.

27, ఫిబ్రవరి 2010, శనివారం

అప్రంటిస్ ఉపాధ్యాయుల అప్రంటిస్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ జి.ఒ నెం.2 దిః05-01-2009 విడుదల చేసింది.ఆ జి.ఒ పురపాలక సంఘ,ఎయిడెడ్ మరియు ట్రైబల్ వెల్ ఫేర్ ఉపాధ్యాయులకు వర్తింపచేస్తూ సి.యస్ గారు సవరణ మెమో 641 దిః11/11/2009న జారి అయినది.

8, జనవరి 2010, శుక్రవారం

పరిచయము

నా పేరు నరేష్ కుమార్,
పొన్నూరు పురపాలక ప్రాథమిక పాఠశాల సహ అధ్యాపకునిగా పని చేస్తున్నాను.